అగ్రరాజ్యంలో కరోనా.. 24 గంటల్లో..

అగ్రరాజ్యంలో కరోనా.. 24 గంటల్లో..
లాస్ ఏంజిల్స్‌లోని అధికారులు, ప్రయాణీకులు ఇంతకు ముందులాగ వేడుకల్లో పాల్గొనలేకపోయారు

యునైటెడ్ స్టేట్స్ బుధవారం 2,400 మందికి పైగా కోవిడ్ మరణాలను నమోదు చేసింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం గత ఆరు నెలల్లో ఒక్క రోజులో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి అని వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 262,080 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, 24 గంటల్లో 2,439 మరణాలు నమోదవడంతో పాటు, దాదాపు 200,000 కొత్త కేసులను కూడా నమోదు చేసింది.

అమెరికన్లు సాధారణంగా వారి అత్యంత ముఖ్యమైన జాతీయ సెలవుదినాలలో ఒకటైన గురువారం విందులు, వినోదాల కోసం కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఉండటానికి దేశాలు చుట్టేస్తుంటారు. లాస్ ఏంజిల్స్‌లోని అధికారులు, ప్రయాణీకులు ఇంతకు ముందులాగ వేడుకల్లో పాల్గొనలేకపోయారు. కరోనా మహమ్మారి వారి ఆనంద సమయాలను నీరుగార్చింది. మరోవైపు కరోనా తీవ్రత తగ్గిందని భావించిన ప్రజలు మాస్కులు ధరించడాన్ని, సామాజిక దూరాన్ని పాటించడాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు.

ఈనేపథ్యంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు గుర్తించారు. థ్యాంక్స్ గివింగ్ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మాట్లాడుతూ.. వ్యాక్సిన సాధ్యమైనంత త్వరగా ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మీరు సాధారణ జీవితం గడిపే రోజులు రాబోతున్నాయని ప్రజలను ఉద్దేశించి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story