కరోనా పుట్టిల్లు వుహాన్ ల్యాబ్ కాదు

కరోనా పుట్టిల్లు వుహాన్ ల్యాబ్ కాదు
కోవిడ్ పై అమెరికా నిఘా విభాగాల సంచలన నివేదిక

ఇప్పటివరకు కరోనా పుట్టిల్లు చైనాలోని వుహాన్ లేబ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు కాదని తెలుస్తోంది . ప్రపంచాన్ని అల్లాడించిన కోవిడ్ వ్యాప్తి పై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంజనల నివేదికను విడుదల చేశాయి. ఊహన్ ల్యాబ్ నుంచే కోవిడ్ వచ్చిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదన్నది ఈ నివేదిక సారాంశం.

కరోనా వచ్చి తగ్గినా కరోనా పుట్టుకకు సంబంధించి వార్తలలో ఇంకా గందరగోళం ఉంది. నిజానికి కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో ఉన్న వైరాలజీ ఇనిస్టిట్యూట్ నుంచి బయటపడిందని వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని, ఇందుకు సంబంధించి నేరుగా ఎలాంటి సాక్ష్యాలు లేవని అమెరికా నిఘా విభాగం తెలిపింది. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఒక నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. వైరస్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందన్న విషయాన్ని తోసిపుచ్చలేమని, అయితే, ఇందుకు సంబంధించిన మూలాలను ఖచ్చితంగా కనుగొనలేకపోయామని పేర్కొంది.

సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మరో ఏజెన్సీ తో కలిసి వుహాన్‌ ఇన్స్టిట్యూట్లో కరోనా వైరస్ పై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించాయి. అయినప్పటికీ ఈ వైరస్ వ్యాప్తికి కారణమయ్యే నిర్దిష్ట సంఘటనలకు సంబంధించిన ఆధారాలు తమకు లభించలేదని ఏజెన్సీలు ప్రకటించాయి.

చైనా వుహాన్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ పుట్టింది అంటూ అగ్రరాజ్యం అమెరికా సహా అన్ని దేశాలు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి వెనుక కుట్ర కోణం కూడా ఉందన్న ఆరోపణలూ వచ్చాయి. చైనా మాత్రం వాటిని ఖండిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ నివేదికతో చైనాకు కరోనా విషయంలో దాదాపుగా క్లీన్‌చిట్‌ లభించేసినట్లయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story