Chinese garlic: చైనా వెల్లుల్లితో జాతీయ భద్రతకు ప్రమాదకరం..

Chinese garlic: చైనా వెల్లుల్లితో  జాతీయ భద్రతకు ప్రమాదకరం..
యూఎస్ సెనేటర్ సంచలన ఆరోపణ

చైనా నుంచి దిగుమతి చేసుకునే వెల్లుల్లిపై రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా సెనెటర్ రిక్ స్కాట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వెల్లుల్లితో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని, దేశ ప్రజలకు హానికరమని కూడా చెప్పుకొచ్చారు. చైనా వెల్లుల్లి దిగుమతులపై దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సెక్రెటరీకి ఫిర్యాదు చేసిన ఆయన, వెల్లుల్లి పెంపకంలో చైనా వారు అపరిశుభ్ర విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. మురుగునీటిని ఎరువుగా ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లి కారణంగా అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వచ్చే అవకాశం ఉందని రిపబ్లిక్ పార్టీకి చెందిన రిక్ స్కాట్ అనే ఒక సెనెటర్ కామర్స్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లి సురక్షితం కాదని.. వెల్లుల్లి సాగులో చైనా అపరిశుభ్రమైన సాగు పద్ధతులను అనుసరిస్తోందని పేర్కొన్నారు. చైనాలో ఉత్పత్తి అవుతోన్న వెల్లుల్లి నాణ్యత లేకపోవడంతో ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తుందని రిక్ స్కాట్ తెలిపారు. చైనాలోని వ్యర్థాలతో వెల్లుల్లి సాగుకు సంబంధించి ఆన్‌లైన్‌లో చాలా వీడియోలు, డాక్యుమెంటరీలు అందుబాటులో ఉన్నాయని ప్రస్తావించారు.


తాజా వెల్లుల్లితో పాటు చిల్డ్ గార్లిక్ ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే అగ్రగామి కాగా అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. వెల్లుల్లి విషయంలో కొన్ని ఏళ్లుగా అమెరికా, చైనా మధ్య విభేదాలు నెలకొన్నాయి. చైనా అతి తక్కువ ధరలకు వెల్లుల్లిని తీసుకొచ్చి తమ దేశంలో కుమ్మరిస్తోందంటూ అమెరికా గతంలో ఆరోపించింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు చైనా దిగుమతులపై రకరకాల చార్జీలు కూడా బాదింది.

మరోవైపు.. క్యూబెక్‌లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలోని ఆఫీస్ ఫర్ సైన్స్ అండ్ సొసైటీ.. చైనాలో వెల్లుల్లిని పండించడానికి మురుగును ఎరువుగా ఉపయోగిస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని 2017లోనే క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. ఈ వెల్లుల్లితో ఎలాంటి సమస్య లేదని కూడా స్పష్టం చేసింది. మానవ వ్యర్థాలు జంతువుల వ్యర్థాల్లాగా ఎంతో సమర్థవంతమైన ఎరువులు తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story