USA: చైనాకు వెళ్ళద్దు

పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసిన అమెరికా

చైనాలో పర్యటించాలనుకునే అమెరికన్లకు జాగ్రత్తలు చెప్పింది బైడెన్ ప్రభుత్వం. సరదాగా మీరు అక్కడికి వెళ్లినా సరే అక్కడి పోలీసులు మిమ్మల్ని తప్పుడు కేసులతో అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈమేరకు తన పౌరుల కోసం అమెరికా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

తమ ప్రభుత్వాన్ని, కానీ స్థానిక యంత్రాంగాన్ని కానీ విమర్శించే విదేశీయులను చైనా ప్రభుత్వం తట్టుకోలేరని అంటోంది అమెరికా. వారిని తక్షణమే అరెస్టు చేయించడమే కాక దేశం నుంచి వెళ్లిపోకుండా ఎగ్జిట్ బ్యాన్ విధిస్తోందని తెలిపింది. ట్రిప్పుల కోసం అమెరికా నుంచి చైనాకు వెళ్లే వారికి ఒక అడ్వైజరీ విడుదల చేసింది. డ్రాగన్ కంట్రీ విదేశీయులని అరెస్టు చేసే సమయంలో కనీసం నేరారోపణలను కూడా వెల్లడించడంలేదని వివరించింది. ఈమేరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఆర్బిట్రరీ చట్టాలను కఠినంగా అమలు చేస్తోందని అమెరికా తన అడ్వైజరీలో పేర్కొంది. అమెరికన్ పాస్పోర్ట్ కలిగి, హాంకాంగ్లో నివాస ఉండే ఒక వ్యక్తి గూఢచార్యానికి పాల్పడిన నేరం ఖరారు అవ్వడంతో అతనికి జీవిత ఖైదు విధించిన విషయాన్ని అమెరికా ఈ సందర్భంగా ప్రస్తావించింది. కనీసం ఎప్పుడు అరెస్టు చేశారు అన్న విషయాన్ని కూడా పేర్కొనలేదని గుర్తు చేసింది. నిజానికి విదేశీయులను నిర్బంధించిన అనేక హై ప్రోఫైల్ కేసులు గత కొన్ని సంవత్సరాలుగా చైనాకు, ఇతర పాశ్చాత్య దేశాలకు మధ్య సంబంధాలను బాగా దెబ్బతీశాయి.





అలాగే చైనా వెళ్లేముందు కానీ, చైనాలో ఉన్నపుడు కానీ డ్రగ్స్ తీసుకోవద్దని, చైనాలో జరిగే నిరసన ప్రదర్శనల జోలికి పోవద్దని, సరదాకి కూడా వాటిలో పాల్గొనవద్దని అమెరికా తన పౌరులను హెచ్చరించింది. చైనాలోనే కాదు హాంగ్ కాంగ్, మకావూలలో పర్యటించే సమయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.సుమారు రెండు సంవత్సరాల క్రితం కూడా అమెరికా ఇలానే చైనా పర్యటనకు వెళ్లే తన పౌరులకు మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే అందులో కోవిడ్ కారణంగా జాగ్రత్తగా ఉండాలి అనే అంశం మాత్రమే ఉండేవి.

Tags

Read MoreRead Less
Next Story