USA : కోర్టులో లొంగిపోనున్న ట్రంప్

USA : కోర్టులో లొంగిపోనున్న ట్రంప్
అరెస్ట్ తప్పదంటూ ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. తనకు అండగా నిలవాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారు

కోర్టులో లొంగిపోనున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్ టాప్ పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల వ్యవహారంలో అరెస్ట్‌ను ఎదుర్కొంటోన్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన అరెస్ట్ తప్పదంటూ ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. తనకు అండగా నిలవాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అక్రమ చెల్లింపుల కేసులో మన్‌హట్టన్ న్యాయస్థానం తీర్పు వెలువడించే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.


ఇక ఆయనపై ఉన్న ఆరోపణలు రుజువైతే అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్న తొలి క్రిమినల్ కేసు ఇదే అవుతుంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎన్నికల కంటే ముందే టాప్ అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌ తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు.దీనికోసం తన తరఫు అడ్వొకేట్‌ను మధ్యవర్తిగా పెట్టి- ఆమెకు పెద్ద మొత్తం డబ్బులను చెల్లించారనేది ట్రంప్ ఉన్న ఆరోపణలు. 2006లో ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్నారని స్టార్మీ డేనియల్స్ బయటపెట్టారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని, తాను నోరెత్తకుండా ఉండటానికి లక్షా ముప్పై వేల డాలర్లు ఇచ్చారని తెలిపింది.

మరోవైపు ఈ కేసులో కోర్టు తనను దోషిగా తేల్చిన వెంటనే లొంగిపోవాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆయన న్యూయార్క్‌కు చేరుకున్నారు. తాను నివసిస్తోన్న వెస్ట్‌పామ్ బీచ్ నుంచి ప్రైవేట్ ఫ్లైట్‌లో ట్రంప్ న్యూయార్క్‌లోని లాగ్వార్డియా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ట్రంప్ తరఫున వైట్ కాలర్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ టాడ్ బ్లాంచె.. మన్‌హట్టన్ కోర్టులో వాదించనున్నారు.విచారణ కొనసాగే సమయంలో కోర్టు రూమ్‌కు మీడియా ప్రవేశాన్ని నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. వీడియో, ఫొటో, రేడియో కవరేజీని అనుమతించవద్దని కోరారు. లొంగిపోయిన తరువాత కూడా ట్రంప్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపెట్టొద్దని అభ్యర్థించారు. ఇంకాస్సేపట్లో విచారణ ప్రారంభం కానుంది.

Tags

Read MoreRead Less
Next Story