USA : ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

USA : ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సుమారు 1200 మంది అన్నివర్గాల నుంచి ఈ వేడుకకు హాజరయ్యారు

న్యూజెర్సీ లో అమెరికా తెలుగు సంఘం ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉగాది వేడుకలను ఎడిసన్‌లోని రాయల్ అల్బెర్ట్స్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు. సుమారు 1200 మంది అన్నివర్గాల నుంచి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకను ఆటా అధ్యక్షురాలు మతి మధు బొమ్మినేని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తర్వాత న్యూ జెర్సీ ఆటా బృందం సంప్రదాయ పద్ధతిలో ఉగాది పూజలు నిర్వహించారు. అను దాసరి బృందం ప్రార్థనా గీతాన్ని ఆలపించి శ్రోతలను ప్రేక్షకులను మైమరపింపచేసింది. చీఫ్‌ గవర్నమెంట్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ అసిస్టెంట్‌ టు ప్రెసిడెంట్‌ కెల్లీ డ్రేక్పోర్డ్స్‌ ముఖ్య అతిథిగా హాజరయో్యారు.. మహిళా సాధికారత గురించి ప్రేరణ కలిగించే విధంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షో, ముగ్గుల పోటీలు, నృత్య కార్యక్రమాలు, క్విజ్‌ పోటీలు, మ్యూజికల్‌ చైర్స్‌ వంటి ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమం దిగ్విజయం గీతారెడ్డి, మీనాక్షి తునికి, అర్చన వేముల, అను దాసరి, నందిని దర్గుల, కవిత లింగంపల్లి, హరిని ఆనూతి, లలిత రెడ్డి, నివేదిత గౌడ్, అపర్న కనుగొ, షిల్పి కుందూర్, స్వప్న తుమల్ల, సరిత ఆర్జుల, జ్యోతి కెథిది, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీలత రెడ్డీ, మాధవి ఆరువ, మాధవి గొట్టిముక్కుల, ఉష అప్పిడి, చిత్ర జంబుల వంటి బృందంలోని మహిళమణులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story