America : మరోసారి తుపాకీ మోత

America : మరోసారి తుపాకీ మోత
రెండు చోట్ల కాల్పులు, ఆరుగురి మృతి..

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. మళ్లీ తుపాకీ మోత మోగింది. రాజధాని వాషింగ్టన్ డీసీలో నార్త్‌వెస్ట్ లోని నైట్‌లైఫ్ ప్రాంతాల్లో జరిగిన మాస్ షూటింగ్‌ లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. మరోవైపు అనకోస్టియా ప్రాంతంలో ఈ కూడా కాల్పులు జరిగి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు కారణం తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

అమెరికాలో విచ్చలవిడి తుపాకుల సంస్కృతి మరో సామూహిక కాల్పుల ఘటనకు దారితీసింది. ఆయుధాలు ధరించి ఒక దుండగుడు తెల్లవారుఝామున నగర వీధులలో విచక్షణా రహితంగా కాల్పులు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా ఒక అతనిని ఆసుపత్రికి తరలించారు. అలాగే అర్ధరాత్రి జరిగిన కార్పొరేట్ లో కూడా మరల ముగ్గురు మరణించారు

ఈ ఏడాది ఇదే ప్రాంతంలో 150కిపైగా హత్యలు జరిగాయి. గత రెండు దశాబ్దాలతో పోస్తే ఇది అత్యధికం. ఈ నెలలో ఇప్పటివరకు ఐదుగురు కాల్పులకు బలైనట్టు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. ఎప్పుడు ఏ గన్ సౌండ్ వినిపిస్తుందో అనే బిక్కుబిక్కు మంటున్నామని చెబుతున్న స్థానికులు పోలీసులు ఈ విషయంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని కోరుకుంటున్నాం అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story