USA Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం

USA Tornadoes:  అమెరికాలో టోర్నడోల బీభత్సం

అమెరికాలో టోర్నడోలు మళ్లీ బీభత్సం సృష్టించాయి. అర్కన్సా, ఇలినాయి రాష్ట్రాల్లో టోర్నడోల దెబ్బకు ఏడుగురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్లు, థియేటర్ల రూఫ్​లు టోర్నడో ధాటికి గాల్లో ఎగిరిపోయాయి. ఇలినాయి స్టేట్​లోని సల్లివాన్ కౌంటీలో ముగ్గురు చనిపోయారని ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అధికారులు తెలిపారు.ఈ కౌంటీలో తుఫాను దెబ్బకు పలు ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. కొంతమంది స్థానికులు గల్లంతయ్యారు.లిటిల్ రాక్ ఏరియాలో ఒకరు చనిపోయారు.24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మరోవైపు బెల్విడేర్ లో ఓ థియేటర్ రూఫ్ కూలిపోయి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయపడ్డారు. అర్కన్సా స్టేట్​లోని విన్ సిటీలో కూడా టోర్నడో బీభత్సం సృష్టించింది. దాని తీవ్రతకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటి శిథిలాల్లో చిక్కుకొని పలువురు స్థానికులు గాయపడ్డారు.ఇలినాయిలోని లిటిల్ రాక్ నుంచి పక్కనే ఉన్న ప్రాంతానికి టోర్నడో వ్యాపించింది.

ఇక అర్కన్సా స్టేట్ లోని పలు సిటీల్లో ప్రవేశించి వాహనాలను ధ్వంసం చేసింది. క్లింటన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు బాత్ రూంల్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు.మేంఫిస్,టెన్నెసీ,విన్ పట్టణంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గతవారం క్రితమే మిసిసిపి స్టేట్​లో టోర్నడో సంభవించి 25 మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story