Uttarakhand: రెస్కూ టీమ్‌తో మమేకమైన ఆర్నాల్డ్ డిక్స్

Uttarakhand: రెస్కూ టీమ్‌తో మమేకమైన ఆర్నాల్డ్ డిక్స్
టన్నెల్ సక్సెస్ వెనుక ఉన్న ఆస్ట్రేలియన్ నిపుణుడు

త్తరాఖండ్ టన్నెల్…అక్కడి రెస్క్యూ ఆపరేషన్..17 రోజులుగా భారతదేశమంతా మారుమోగిన విషయం. అందులో చిక్కుకుపోయిన కార్మికులు క్షేమంగా బయటకు రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. చాలా మంది వారిని తీసుకురావడానికి శ్రమపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్‌క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించే రెస్కూ ఆపరేషన్‌లో కీలకంగా వినిపించిన పేరు ఆర్నాల్డ్ డిక్స్. మన ఊరు కాదు.. మన దేశం కూడా కాదు. అయినా ఇంత దూరం వచ్చి అందరితో మమేకమవుతూ రక్షణ చర్యల్లో పాలు పంచుకున్న ఈ విదేశీయుడు రోజులో 24 గంటలు ఎందుకింత కష్టపడ్డాడని అందరికీ అనిపిస్తూ ఉండవచ్చు. అయితే అతని గురించి తెలిసిన వారికి మాత్రం ఇదేమీ ఆశ్చర్యం కాదు. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ ఆస్ట్రేలియా స్వతంత్ర విపత్తు పరిశోధకుడు.

కార్మికలు క్షేమంగా బయటకు రావడం ఈయన ఎంత కష్టపడ్డారు, ఎంత తపించారు అంటే..చివరి రోజు వారు బయటకు వచ్చేస్తారు అని నమ్మకంగా తెలిసిన తర్వాత అర్నాల్డ్ పరుగు పరుగున వెళ్ళి అక్కడే ఓ గుట్ట మీద పెట్టిన హిందూ దేవుడికి దండం పెట్టుకునేంతగా. ఆ నిమిషం తాను ఎవరు..ఎవరికి కృతజ్ఞతలు చెబుతున్నాడు అనే విషయం మర్చిపోయారు అర్నాల్ట్. కేవలం కార్మికులు బయటకు వస్తున్నారన్న ఆనందం, ఎమోషనల్ ఒక్కటే పని చేశాయి.


ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ ఆస్ట్రేలియా స్వతంత్ర విపత్తు పరిశోధకుడు. అంతర్జాతీయ టన్నెలింగ్ అధ్యక్షుడు కూడా. సిల్‌క్యారా టన్నెల్ రెస్కూ ఆపరేషన్‌ను సవాలుగా తీసుకున్నారు. నవంబర్ 20నుంచి రెస్కూ ఆపరేషన్‌లో దిగిపోయారు.అప్పటినుంచి సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికలును తన సొంత బిడ్డలుగా భావించి వారి యోగక్షేమాల కోసం పరితపించారు.అటు కార్మికలుతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తూనే ఇటు రక్షణ చర్యలను కొనసాగించారు.

తన టీమ్ తో భారత్ కి వచ్చి పని మొదలుపెట్టిన ఆర్నాల్డ్ కు సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. తొలుత ఓ పైపును సొరంగంలోని శిథిలాల్లోకి పంపి కూలీలను పైకి తేవాలని ప్రయత్నించినా డ్రిల్లింగ్ చేస్తున్న అగర్ మెషీన్ బ్లేడ్లు విరిగిపోయాయి. దీంతో ఆ బ్లేడ్లు కట్ చేసేందుకు మరింత సమయం పట్టింది. మరో వైపు ఆల్టర్నేటివ్ గా సొరంగం పక్కన కొండను సైతం నిలువుగా డ్రిల్ చేయటం మొదలుపెట్టారు. ఈ పనులు అన్నింటిలో కీలకపాత్ర పోషించిన ఆర్నాల్డ్ డిక్స్ ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి కనిపించగానే స్పిరుచ్యువల్ ఎమోషన్ కి లోనయ్యారు. పరుగు పరుగును గుట్ట ఎక్కి అక్కడే ఉన్న దేవుడికి సాగిలపడ్డాడు. దేవుడికి దణ్ణంపెట్టుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ పూర్తై కూలీలు సేఫ్ గా బయటకు రావాలని ఆయన పడుతున్న తపన అక్కడ అందరినీ కదిలించివేసింది.

Tags

Read MoreRead Less
Next Story