మరీ అంత బద్దకమా.. నాలుగడుగులైనా వేయకపోతే ఎలా!!

మరీ అంత బద్దకమా.. నాలుగడుగులైనా వేయకపోతే ఎలా!!
ఏం బతిమాలుతున్నానని స్టయిల్ కొడుతున్నావా.. ప్లీజ్.. నా బుజ్జివి కదూ.. రావూ..

మనుషులు ఎక్కి కూర్చుంటే పరిగెడతావు కానీ నాతో వాకింగ్‌కి రమ్మంటే రావా.. ఏదో ఫ్రెండ్‌వి కదా అని పిలిస్తే అంత ఇష్టం లేనట్టు మొహం పెడుతున్నావు. నాకు ఇక్కడ ఇంకెవరున్నారు చెప్పు. అయినా రోజూ వస్తున్నావు కదా.. ఇవ్వాళెందుకు బెట్టు చేస్తున్నావు. ఏం బతిమాలుతున్నానని స్టయిల్ కొడుతున్నావా.. ప్లీజ్.. నా బుజ్జివి కదూ.. రావూ.. నువ్వు తోడుంటే నాకెంతో ధైర్యంగా ఉంటుంది.

నా అరుపులకు భయపడతారు కానీ నన్ను చూడాలని ఎవరూ అనుకోరు.. అదే నువు నాతో ఉంటే నీతో పాటు నన్ను కూడా చూస్తారు. అందుకే ఏది ఏమైనా నువ్వు నాతో ఈ రోజు వాకింగ్‌కి రావాల్సిందే అని పట్టుబట్టి లాక్కెళుతోంది ఓ కుక్కపిల్ల గుర్రాన్ని.

ఈ ముచ్చటైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆస్ట్రేలియా (Australia) లోని న్యూ సౌత్ వేల్స్ ‌కు చెందిన ఓ వ్యక్తి. ఆయన తన ఫాంలో గుర్రాలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో అతడు పెంచుకుంటున్న కుక్కపిల్ల ఒడిన, పది నెలల గుర్రం పిల్ల మోజోతో స్నేహంగా ఉంటోందట. అవి రెండూ రోజూ ఫాంలో కలిసి తిరగడం, కలిసి ఆడుకోవడం చేస్తుంటాయట.

ఈ నేపథ్యంలో ఓ రోజు అవి వాకింగ్ చేస్తుండగా యజమాని ఆ దృశ్యాన్ని వీడియో తీసి పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఇందులో కుక్కపిల్ల గుర్రానికి కట్టిన తాడును నోటితో పట్టుకుని లాక్కెళుతూ ముందుకు నడుస్తోంది. ఆ గుర్రం రానని మొరాయిస్తుంటే, రమ్మని బతిమాలుతున్నట్లుగా ఉంది కుక్కపిల్ల తీరు.

ఈ వీడియో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. నెటిజన్లు వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వావ్ చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో అని , కుక్క పిల్ల గుర్రాన్ని వాకింగ్‌కి తీసుకువెళుతుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story