అంతర్జాతీయం

రెస్టారెంట్‌లో చిరుత.. ఎలా తప్పించుకోవాలో తెలియక..

అనుకోని అతిధిని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు రెస్టారెంట్ నిర్వాహకులు.

రెస్టారెంట్‌లో చిరుత.. ఎలా తప్పించుకోవాలో తెలియక..
X

అడవిలో అందమైన రెస్టారెంట్ కట్టుకున్నారు.. మమ్మల్ని ఒక్కసారి కూడా పిలవలేదు.. అయినా మీరు పిలిచేదేంటి.. నేనే వస్తా.. నాక్కావలసినవి ఏమైనా ఉంటే తినేస్తా అంటూ ఓ చిరుత దక్షిణాఫ్రికాలోని ఓ రెస్టారెంట్‌కు వచ్చింది.. ఆ అనుకోని అతిధిని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ రోజు మనం దానికి ఆహారం కావాలసిందే అని గుండె చిక్కబట్టుకుని బిక్కు బిక్కు మంటూ ఓ మూల నక్కి కూర్చున్నారు.. దక్షిణాఫ్రికాలోని సాబీ సాండ్స్ గేమ్ రిజర్వ్‌లోని సింగిటా ఎబోనీ లాడ్జ్‌లో చిరుతపులి తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను క్రుగర్ సైటింగ్స్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. 7 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. రెస్టారెంట్‌లోకి చొరబడిని చిరుతను చూసి తప్పించుకునే దారిలేక దాన్ని అలాగే చూస్తుండి పోయారు.. మంచి చిరుతలా ఉంది.. మనుషుల్ని ఏమీ చేయాలేదు.. రెస్టారెంట్ అంతా కలియతిరిగింది.. మెట్ల మీద నుంచి పైకి ఎక్కి చూసింది.. దాని ఫ్రెండ్స్ ఎవరూ కనిపించలేదేమో.. ఇది మన ప్లేస్ కాదు అనుకుందో ఏమో.. ఎంచక్కా వచ్చిన దారే వెళ్లిపోయింది..

చిరుత అలా వెళ్లిపోగానే హమ్మయ్.. అంటూ ఊపిరిపీల్చుకున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఏదేమైనా ఈ రోజు మా జీవితాల్లో ఒక సాహస సన్నివేశం జరిగింది.. చిరుతను అత్యంత దగ్గరగా చూశామని అన్నారు. వన్యమృగాలకు, మనుషులకు మధ్య సామరస్యత ఉంటుందని ఈ సంఘటన రుజువు చేసిందని అన్నారు. ఆ చిరుత ఎవరిపైనా దాడి చేయకుండా వెళ్లిపోయిందని యాజమాన్యం స్పష్టం చేసింది.

Next Story

RELATED STORIES