అంతర్జాతీయం

ఓటమి తప్పేట్టు లేదని వైట్‌హౌస్ ఖాళీ చేస్తున్న'ట్రంప్' : నెటిజెన్స్

ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం.. జరగాల్సిందంతా జరిగిపోయింది.

ఓటమి తప్పేట్టు లేదని వైట్‌హౌస్ ఖాళీ చేస్తున్నట్రంప్ : నెటిజెన్స్
X

అగ్రరాజ్య అధిపతి ఎవరో తెలిసిపోయింది.. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం.. జరగాల్సిందంతా జరిగిపోయింది.. ఎందుకు చెప్పించుకోవడం.. అందుకే నేనే వెళిపోతున్నా.. ఓటమిని అంగీకరిస్తున్నా అని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటున్నారేమో.. అందుకే ట్రక్కు మాట్లాడుకుని ఉంటారు.. వైట్ హౌస్ ఖాళీ చేయడానికి అని అధ్యక్షుడిని ఆటపట్టిస్తున్నారు.. ఇష్టం వచ్చిన్నట్లు ట్రోల్ చేస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్ ముందంజలో ఉండడం ట్రంప్‌కు మింగుడు పడట్లేదు.. ఎన్నికల గురించి ట్రంప్‌ తప్పుడు ప్రచారం చేస్తుండడంతో విమర్శకులు సోషల్ మీడియాను వేదిక చేసుకుని ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ క్రమంలో వైట్‌హౌస్ ముందు ఓ ట్రక్కు ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఇక నెటిజెన్స్ ట్రంప్‌ని ఓ ఆట ఆడుకున్నారు.. దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమైన పత్రాలు, హార్డ్ డిస్క్‌లు తరలిస్తున్నారని.. వెండి, బంగారు వస్తువులను తరలించడానికి ట్రంప్ ట్రక్కు మాట్లాడుకున్నారని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ పసుపు రంగు ట్రక్కు అధ్యక్ష భవన ప్రధాన ద్వారం ఎదురుగా ఉంది. ట్రక్కు మీద ఉన్న అక్షరాలు సరిగా కనబట్లేదు. కానీ నెటిజెన్స్ మాత్రం అది పెస్న్కే కంపెనీకి చెందినదిగా భావిస్తున్నారు.

Next Story

RELATED STORIES