అంతర్జాతీయం

ఈఫిల్ టవర్‌లో బాంబ్ అంటూ బెదిరింపు కాల్స్

ఈఫిల్ టవర్‌లో బాంబ్ అంటూ బెదిరింపు కాల్స్
X

ఈఫిల్ టవర్‌లో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. టవర్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను ఖాళీ చేపించారు. అసాంఘీక శక్తులు ఎవరూ రాకుండా ఈ ప్రాంతం మొత్తాన్ని అష్టదిగ్భందనం చేశారు. మొత్తం బారికేట్లు ఏర్పాటు చేశారు. ఈఫిల్ టవర్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఓ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఎవరో అగంతకుడు కాల్ చేసి ఈఫిల్ టవర్‌లో బాంబ్ పెట్టినట్టు తెలిపాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై సియెనే నది నుంచి ట్రోకాడెరో ప్లాజా వరకు ఉన్న వంతెనను, ఈఫిల్ టవర్ క్రిందనున్న వీథులను అష్ట దిగ్బంధనం చేశారు. అయితే తనిఖీల్లో బాంబు కనిపించలేదు. అయినప్పటికీ పోలీసులు అలెర్ట్ గా ఉన్నారు. ఈ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story

RELATED STORIES