Guinness World Record : చూపు పోగొట్టిన ఏడుపు

Guinness World Record : చూపు పోగొట్టిన ఏడుపు
రికార్డుకోసం ప్రయత్నిస్తే కళ్లుపోయాయి

పిచ్చి పలు విధాలు అంటారు. ఒక్కోరికి ఒక్కో పిచ్చి. ఏదో చేసేద్దామని, రికార్డులు సృష్టించేద్దామని, ఆల్రెడీ ఉన్న రికార్డులను బద్దలు కొట్టేద్దాం అని, ఇలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రికార్డుల కోసం కొంతమంది చేసే పనులను మనం అస్సలు ఆలోచించలేం.. ఇదిగో ఈ వ్యక్తి ఏడిచి రికార్డ్ సృష్టిద్దాం అనుకున్నాడు. అసలు ఇలాంటి ఆలోచనే వింత. ఆగకుండా 100 గంటలు వంట చేసే రికార్డు సృష్టించగా లేనిది, నేను కొన్ని రోజులపాటు ఏడుస్తూ ఉండి రికార్డు సృష్టించలేదా అని అనుకున్నాడో ఏమో నైజీరియన్‌కి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఏడ్వడంలో ప్రపంచ రికార్డు సాధించాలని డిసైడ్ ఆయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రోజులపాటు నాన్ స్టాప్‌గా ఏడిచాడు.

చివరికి రికార్డు సాధించాడో లేదో పక్కన పెడితే అనవసరం అయిన కష్టం తెచ్చిపెట్టుకున్నాడు. ఏకధాటిగా ఏడ్చి అతడు సుమారు 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అంతలా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి ఏడ్వడంలో వరల్డ్‌ రికార్డు నెలకొల్పాలన్న అతడి పట్టుదల చివరకు అతడికి కన్నీటిని మిగిల్చింది.

ఐతే అతను గిన్నిస్‌ వరల్ఢ్‌ రికార్డుకి పద్ధతి ప్రకారం దరఖాస్తు చేయలేదు కాబట్టి ఆ ఫీట్‌ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి క్రేజీ​ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. నైజీరియాలో ఇటీవల ఓ చెఫ్‌ ఏకంగా 100 గంటల పాటు వంట చేసి పాపులర్‌ అయ్యారు. రికార్డు సంగతి పక్కన పెడితే దేశ ఉపాధ్యక్షుడు, ఇతర సెలబ్రిటీల నుంచి ఆమెకు ప్రశంసలు లభించాయి. దీంతో నైజీరియాలో గిన్నిస్‌ రికార్డుల పిచ్చి ఎక్కువైంది. అర్థం పెట్టలేని పనులతో గిన్నిస్ బుక్ కి వెళ్ళేముందు కాస్త ఆలోచించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ నైజీరియన్లకు గిన్నిస్‌ సంస్థ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story