West Africa: 735 గుడ్లను తలపై మోసాడు.. దీంతో..

West Africa: 735 గుడ్లను తలపై మోసాడు.. దీంతో..
West Africa: గిన్నీస్ రికార్డును సాధించాలంటే ఎంత సాహసమైనా చేయాలి.

West Africa: గిన్నీస్ రికార్డును సాధించాలంటే ఎంత సాహసమైనా చేయాలి. ఒక్కొక్కసారి అవి ఫెయిల్ అయినా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండాలి. ఏ యాక్ట్ వేనుక ఏ రికార్డ్ ఉందో ఎవ్వరం చెప్పలేం. అలాగే గుడ్లను తలపై మోస్తూ గిన్నీస్ రికార్డ్ సాధించేసాడు ఓ వ్యక్తి. అదేంటి తలపై గుడ్లు మోస్తే రికార్డ్ ఇచ్చేస్తారా? అనుకుంటున్నారా.. మరి అతను మోసింది 735 గుడ్లు కదా..

వెస్ట్ ఆఫ్రికాలో ఓ వ్యక్తి తన తలపై 735 గుడ్లు మోసి గిన్నీస్ రికార్డ్ కొట్టిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రేగరీ డిసిల్వా అనే వ్యక్తి చేసిన సాహసం ఇది. తాను గుడ్లు మోస్తున్న ఫోటోను ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పైగా అతడి టోపీకి అన్ని గుడ్లను అతికించుకోవడానికి మూడు రోజులు పట్టిందట. అందుకే అవి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోకుండా అలాగే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story