అంతర్జాతీయం

జాతీయవాదానికి ఇది సమయం కాదు: డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఒక శత్రువు కరోనా అని.. దానిపై అందరం ఏకమై పోరాటం చేయాలని డబ్ల్యూహెచ్‌వో

జాతీయవాదానికి ఇది సమయం కాదు: డబ్ల్యూహెచ్ఓ
X

ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఒక శత్రువు కరోనా అని.. దానిపై అందరం ఏకమై పోరాటం చేయాలని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసుస్ అన్నారు. కానీ, ఈ సమయంలో జాతీయవాదాన్ని తెరపైకి తెస్తే.. ఈ మహమ్మారి ముంగిట మరింత కాలం ఓటమిని చూడాల్సి వస్తుందిని హెచ్చరించారు. వ్యాక్సిన్ తమకే దక్కాలనే స్వార్థ జాతీయవాద వైఖరిని దేశాలు విడిచిపెట్టాలని.. లేకుంటే, కరోనా సంక్షోభాన్ని మరింత కాలం ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలు రూపుమాపే మహా యజ్ఞానికి చాలా ధనిక దేశాలు ముందుకు వస్తున్నాయని.. ఇది శుభపరిణామమని అన్నారు. అయితే, కొన్ని దేశాలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదని అమెరికాను ఉద్దేశించి మాట్లాడారు.

Next Story

RELATED STORIES