అంతర్జాతీయం

జైల్లో పెడతారు కానీ తప్పించుకున్నా పట్టించుకోరు.. ఎక్కడో తెలుసా!!

అక్కడి జైలు అధికారులు మాత్రం వెళ్తే వెళ్లాడులే.. ఇకపై నేరాలకు పాల్పకుండా ఉంటే అంతే చాలు అని తాపీగా సమాధానం చెబుతారు.

జైల్లో పెడతారు కానీ తప్పించుకున్నా పట్టించుకోరు.. ఎక్కడో తెలుసా!!
X

ఇలాంటి వాడిని జైల్లో పడేయాల్సిందే.. బయటకొస్తే ఎంత మంది జీవితాల్ని నాశనం చేస్తాడో అని నేరాలకు పాల్పడి జైలు జీవితం గడుపుతున్న వారి గురించి అందరూ అనుకునే మాట. కానీ అక్కడి జైలు అధికారులు మాత్రం వెళ్తే వెళ్లాడులే.. ఇకపై నేరాలకు పాల్పకుండా ఉంటే అంతే చాలు అని తాపీగా సమాధానం చెబుతారు. అవునా.. అంత స్వేచ్చ ఇచ్చే దేశాలు ఉన్నాయా అంటే అవును ఉన్నాయనే సమాధానం వస్తుంది.. ఆ దేశాల గురించి ఒక సారి తెలుసుకుందాం.

యునైటెడ్ ‌స్టేట్స్ల్‌లో జైలు నుండి తప్పించుకుంటే మరికొన్ని సంవత్సరాలు జైల్లో మగ్గవలసిందే. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధునిక దేశాలలో ఇది జరగదు. మెక్సికో, జర్మనీ, ఆస్ట్రియా, బెల్జియం, నెదర్లాండ్స్ ఇవన్నీ భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. ఆ దేశాలలో, జైలు నుండి తప్పించుకోవడం పూర్తిగా చట్టబద్ధమైనది.

మెక్సికన్ శాసనసభ మరియు న్యాయ వ్యవస్థ ఈ ప్రక్రియలో మరొక నేరానికి పాల్పడితే తప్ప జైలు నుండి తప్పించుకునే చర్య చట్టవిరుద్ధం కాదని వారి నమ్మకాన్ని కొనసాగిస్తోంది. "తప్పించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి స్వేచ్ఛను కోరుతున్నాడు, దాన్ని చట్టం గౌరవిస్తోంది. స్వేచ్ఛ కోసం జైలునుంచి తప్పించుకోవడాన్ని నేరంగా పరిగణించదు.

ఇలానే మరో దేశం బెల్జియం కూడా ఉంది.. "బెల్జియంలో జైలు నుంచి తప్పించుకోవడం చట్టం ప్రకారం శిక్షార్హమైనది కాదు, కాని తప్పించుకునే ప్రయత్నంలో నేరపూరిత నేరాలకు పాల్పడితే తప్పించుకున్న ఖైదీలు శిక్షించబడతారు. తప్పించుకోగలిగిన పది మంది ఖైదీలలో తొమ్మిది మందిని మళ్లీ అరెస్టు చేశారు. "

జైలు నుండి తప్పించుకోవడానికి ఆస్ట్రియాలో ఇంకా చాలా జాగ్రత్తలు ఉన్నప్పటికీ, ఖైదీ తప్పించుకుంటే శిక్షించవచ్చని ఆస్ట్రియా చట్టాలు ఎప్పుడూ చెప్పలేదు. నెదర్లాండ్స్‌లో, ఎవరైనా జైలు నుండి తప్పించుకుంటే అదనపు శిక్షలు విధించరు. పారిపోతే పోయారు జైలు ఊచలు విరగ్గొట్టడం, తోటి ఖైదీలను శిక్షించడం, బయటకు వెళ్లిన తరువాత ఏమైనా నేరాలకు పాల్పడడం వంటివి చేశారంటే మళ్లీ లాక్కొచ్చి జైల్లో కూర్చోబెడతారు. అందండీ సంగతి.. పారిపోయినా పరువుగా బతుకు అంటున్నారు.. ఇది కూడా బానే ఉంది మరి.

Next Story

RELATED STORIES