US Snow Storm: అమెరికాలో మంచు తుపాను.. స్కూల్స్ బంద్,

US Snow Storm: అమెరికాలో మంచు తుపాను.. స్కూల్స్ బంద్,
కరెంట్ బంద్- విమానాలు రద్దు, ఒకరు మృతి

అమెరికాలో మంచు తుపాను.. స్కూల్స్ బంద్, తాకింది. దీని ప్రభావంతో ఈశాన్య ప్రాంతంలో హిమపాతం భారీగా నమోదైంది. తపాను కారణంగా లక్ష 50 వేల కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్‌, బోస్టన్‌లలో దాదాపు 1,200 విమానాలు రద్దవగా.. మరో 2 వేల 700 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు..

అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని మంగళవారం మంచు తుపాను ముంచెత్తింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంచు అడుగు మందాన కురిసింది. ఫలితంగా ప్రయాణికులకు, విద్యార్థులకు, భారీ వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈశాన్య ప్రాంతంలోని పాఠశాలలన్ని మూతపడ్డాయి. న్యూయార్క్‌, మస్సాచుసెట్స్‌, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో విద్యార్థులకు కేవలం ఆన్‌లైన్‌ క్లాస్‌లు మాత్రమే నిర్వహిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో ఇలాంటి మంచు తుపాన్‌ను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. వేల మంది ప్రజలు మంచు తుపాను కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు.ఈ పరిస్థితులు కొవిడ్‌ మహమ్మారి కాలాన్ని తలపిస్తున్నాయని స్థానికులు తెలిపారు. తుపాను కారణంగా పెన్సిల్వేనియాలో ఒక స్నోమొబైలర్‌ ప్రాణాలు కోల్పోయాడు.

మంచు తుపాను కారణంగా ఈశాన్య తీర ప్రాంతంలో సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. తుపాను వల్ల దాదాపు ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కనెక్టికట్‌లోని ఫర్మింగ్టన్‌ పట్టణంలో దాదాపు 15.5 అంగుళాల మేర మంచు కురిసిందని తెలిపారు. లక్ష 50 వేల కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈశాన్య అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించడాన్ని నిషేధించారు. న్యూయార్క్‌, బోస్టన్‌లలో దాదాపు 1,200 విమానాలు రద్దవగా.. మరో 2 వేల 700 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూయార్క్‌ నగరంలో 744 రోజుల తర్వాత మంచుపడింది. ఇక్కడ 2.5 అంగుళాల మేర హిమపాతం నమోదైంది.

పెన్సిల్వేనియా నుంచి మస్సాచుసెట్స్‌ వరకు ఉన్న పట్టణాల్లో మంగళవారం ఉదయం నుంచే మంచు భారీగా పడటం మొదలైంది. మంచు కారణంగా ఘర్షణ కోల్పోయిన రోడ్లు వాహనాల ప్రయాణాలకు అసౌకర్యంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలూ కురిశాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరగాయి. స్థానిక ప్రజలు తమ వద్ద ఉన్న పరికరాలతో పరిసరాల్లోని మంచును తొలగించుకుని తమ రోజువారి పనులను చేసుకుంటున్నారు. ప్రభుత్వం భారీ యంత్రాల సహాయంతో రోడ్లపై పేరుకపోయిన మంచును తొలగించి రహదారులను ప్రయాణాలకు అనువుగా మార్చడానికి చర్యలు తీసుకుంటోంది..

Tags

Read MoreRead Less
Next Story