Guatemala : పిజ్జా తినడానికి అక్కడికి వెళ్ళాలా..

Guatemala : పిజ్జా తినడానికి అక్కడికి వెళ్ళాలా..
పిజ్జా వండుకు తినడానికి.. అగ్నిపర్వతంపైకి వెళ్ళిన మహిళ.

పిజ్జా అంటే చాలా మందికి ఇష్టం.. కొందరికి చీజ్ పిజ్జా అయితే ఇంకొందరికి పనీర్, మరికొందరికి హామ్ పిజ్జా.. ఒక్కొక్కరికి ఒక్కో టెస్ట్..కొందరు పిజ్జా హట్ లో తినాలనుకుంటే ఇంకొందరు యూ ఎస్ పిజ్జా లోనే తినాలి అనుకుంటా. మరి కొందరికి డామినోస్ పిజ్జా అంటే మహా ఇష్టం. సో పిజ్జా కి ప్లేస్ ఇంపార్టెంట్ కానీ ఈవిడెంటో పిజ్జా తినడానికి వెరైటీ ప్లేస్ ఎంచుకుంది. అది ఏ ఫుడ్ కోర్ట్ కాదు.. అగ్ని పర్వతం.. భగభగ మండే అగ్నిపర్వతం.

అలెగ్జాండ్రియా బ్లాడ్జెట్ (alexandrablodgett) అనే మహిళకు సరదాగా అగ్నిపర్వతం మీద పిజ్జా చేసుకుని తినాలనిపించింది. ఇంకెందుకు ఆలస్యం హ్యాపీగా గ్వాటేమాల కు రెడీ అయిపోయింది. అక్కడికి చేరుకొని ఆక్టివ్ గా ఉన్న ఒక అగ్నిపర్వతంపై పిజ్జా తయారు చేసుకొని తింది. ఆ వీడియో తీసి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసుకుంది." యాక్టివ్ గా ఉన్న ఒక అగ్నిపర్వతంపై పిజ్జా చేసుకుని తినడానికి గ్వాటేమాలకు వెళుతున్నాను. అంటే అక్కడి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడటానికి కూడా అని పోస్ట్ పెట్టింది".

2021లో బద్దలైన ఈ అగ్నిపర్వతం ఇప్పటికి యాక్టివ్ గానే ఉంది. నిజానికి ఇది ఒక నేషనల్ పార్కు. ఇందులోనికి వెళ్లాలంటే తప్పనిసరిగా గైడ్ ఉండాలి. అంతే కాదు పిజ్జా తయారు చేసుకోవడం కోసం అన్నీ ముందుగానే అన్నీ బుక్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఒక వ్యక్తి కూరగాయలతో చీజ్ వేసి రెడీ చేసిన పిజ్జాను ట్రై లో పెట్టి తీసుకొచ్చి కింద పెట్టాడు. తరువాత దానిని కుక్ చేశారు. అది తింటూ అలెగ్జాండ్రియా బ్లాడ్జెట్ ఇంస్టా లో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story