World Chocolate Day : కరిగించాలన్న.. కరిగిపోవాలన్నా చాక్లెట్

World Chocolate Day : కరిగించాలన్న.. కరిగిపోవాలన్నా చాక్లెట్
ప్రతి ఏడాది జూలై 7 న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

ఒకప్పుడు శుభవార్త విన్నాము అంటే కాస్త పంచదార, బెల్లం, నోట్లో వేసేవాళ్ళు, తరువాత తరువాత చేతికి స్వీట్ ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. సెలబ్రేషన్ అంటే చాక్లెట్.. పిల్లలు ఏడిస్తే చాక్లెట్.. కరిగించాలంటే చాక్లెట్… కరిగిపోవాలంటే చాక్లెట్..

చాక్లెట్ ను ఇష్టపడని వారు చాలా తక్కువ. తీయగా, టేస్టీగా ఉండే చాక్లెట్ లకు మనం బాగా అలవాటు పడిపోయాం. ఒక పద్ధతిగా తింటే ఇవి మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి, కోకా బీన్స్ లో రకరకాలు మిక్స్ చేసి తయారు చేసే స్వచ్ఛమైన డార్క్ చాక్లెట్, మిల్క్, వైట్ చాక్లెట్ ఇలా రకరకాల చాక్లెట్లు, రకరకాల ఉపయోగాలు.

చాక్లెట్ ను మితంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాకో బీన్స్‌లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు , కొన్ని విటమిన్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే పాలీఫెనాల్స్ అనే ప్రయోజనకరమైన రసాయనాలు కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తపోటును తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, వాపును తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి.





ఇక డార్క్ చాక్లెట్ల వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. డార్క్ చాక్లెట్లను తిన్న రెండు మూడు గంటల్లో మెదడు పనితీరు మెరుగవుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరిస్తాయి. అలాగే ఆక్సిజన్, రక్తం మెదడులోకి సమృద్ధి గా వెళ్లడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి అలసట, వృద్ధాప్యం సమస్యలను తగ్గిస్తాయి.

క్యారెట్లే కాదు డార్క్ చాక్లెట్లు కూడా కంటిచూపును మెరుగుపరుస్తాయి. నాణ్యత కలిగిన డార్క్ చాక్లెట్ ను తింటే సన్ డ్యామేజ్ తగ్గుతుంది. రోజుకు ఒక్క ముక్క డార్క్ చాక్లెట్ ను తింటే రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ఇది అధిక రక్తపోటు స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

2000 బీసీలో కోకా ప్రొడక్షన్ అనేది జరిగింది అని గుర్తించారు. నిజానికి అప్పుడు వారంతా చాక్లెట్ ను ఒక డ్రింక్ గా ఉపయోగించారు. 14 వ శతాబ్దంలో మెక్సికోలో కోకా ని గుర్తించి, దానిని బాగా ధనికులు మాత్రమే ఉపయోగించేవారు. 15వ శతాబ్దంలో అమెరికాకు తర్వాత ఇతర దేశాలకు ప్రయాణించింది చాక్లెట్.

అయితే అప్పట్లో చాక్లెట్ కాస్త లిక్విడ్ రూపంలో ఉండేది. 1828 లో చాక్లెట్ పౌడర్ గా, 1847 లో లో ఇప్పుడు మనం తింటున్నట్టుగా కాస్త గట్టిగా ఉండే చాక్లెట్ బార్ గా మార్పుకు లోనైంది. ఇదండి.. చాక్లెట్ కధ.. ఇంక ఇప్పుడు బ్రేక్ తీసుకొని మీకు నచ్చిన చాక్లెట్ ను ఆస్వాదించండి.

తియ్యని వేడుక చేసుకోండి..

Tags

Read MoreRead Less
Next Story