world corona : ప్రపంచ దేశాలపై కరోనా పంజా... రోజుకు లక్షల్లో కేసులు నమోదు

world corona :  ప్రపంచ దేశాలపై కరోనా పంజా...  రోజుకు లక్షల్లో కేసులు నమోదు
world corona : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు జోరుగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజులో 23 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

world corona : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు జోరుగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజులో 23 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో లక్షా 50వేలకు పైగా కేసులు నమోదుకాగా.. వైరస్‌తో మరో 438 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌, స్పెయిన్‌లలో లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక బ్రిటన్‌లో 88 వేలు, బ్రెజిల్‌ 83 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు జన్మనీ, ఇటలీ, రష్యా, టర్కీల్లోకూడా వైరస్‌ విజృంభిస్తోంది.

మరోవైపు కరోనా విజృంభన నేపథ్యంలో.. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ప్రపంచ దేశాలు హెచ్చరించారు. మహమ్మారి అంతానికి తమ వద్ద అన్ని సాధనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఒమిక్రాన్​ వేరియంట్​ చివరిదిగా భావించటం లేదా చివరి దశలో ఉన్నామనుకోవటం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కీలక లక్ష్యాలను చేరుకుంటే ప్రస్తుతం వణికిస్తున్న కొవిడ్​ దశ ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుందని అంచనా వేశారు. లేదంటే మరిన్ని వేరియంట్లు ఉద్భవించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హెచ్చరించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం 150వ సెషన్‌లో టెడ్రోస్ కీల‌క ప్రసంగం చేశారు. అన్ని దేశాలు కోవిడ్ -19 పరీక్షలను పెంచాలని, భవిష్యత్తులో మరిన్ని వేరియంట్‌ల కోసం స‌న్నద్ధంగా ఉండాలని టెడ్రోస్ తెలిపారు. క‌రోనా సంబంధిత సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని, సంక్షోభం ముగిసే వరకు వేచి ఉండకూడదని అన్నారు.

జాగ్రత్తలు పాటిస్తే సరిపోద్దని.. వైరస్ విషయంలో భయాందోళనలు, నిర్లక్ష్యం వద్దన్నారు టెడ్రోస్. ఇక దేశాలు తమ జనాభాలో కనీసం 70 శాతం మందికి టీకాలు వేయ‌డాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని టెడ్రోస్ సూచించారు. ప్రధానంగా వృద్ధులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, క‌రోనా బారిన‌ప‌డేందుకు ఎక్కువ అవ‌కాశం ఉన్న వ్యక్తులు, అధిక ప్రాధాన్యత గల సమూహాలపై దృష్టి సారించాలని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story