World Photography Day 2023: జ్ఞాపకాలు పదిలంగా..

World Photography Day 2023: జ్ఞాపకాలు పదిలంగా..
నేడు వరల్డ్ ఫోటోగ్రఫీ డే

అబ్బురపరిచే పువ్వు.. ఆత్మీయుల నవ్వు.. నింగిన ఎగిరే పిట్ట, నేలకు జారే జలపాతం.. ఆశ్వాదించే మనసుంటే అన్నీ అద్భుతలే.. కళ్ళు చూసే, మనసు దాచే అద్భుతాలను మనవాళ్లకు చూపించాలంటే.. వంద పదాల వర్ణనే...ఒకే ఒక్క ఫోటో..


సంఘటన గడిగిపోవచ్చు.. చరిత్రగా మారిపోవచ్చు.. కానీ దానిని జ్ఞాపకంగా మార్చుకోవటానికి ఉన్న మార్గం ఫోటో..కానీ ఒకప్పుడు ఫోటో దిగాలంటే అంబరాన్నంటే సంబరం.. ఫోటోగ్రాఫర్ ని పిలుచుకు రావటం దగ్గర నుంచి కుటుంబ సభ్యులను సిద్ధం చేయడం.. ఇలా లెక్కకు మిక్కిలి పనులు.. ఇంక స్టూడియో నుంచి ఆ ఫోటోలు తెచ్చుకునే వరకూ కాళ్ళు నెలమీద ఉండేవే కావు.. ఒక్కో ఫోటో వెనుక ఒక్కో జ్ఞాపకం..రాను రాను కెమెరా నుంచి ఫోటో సెల్ఫోన్ కి మారినా ఆనందం లో మార్పు లేదు.. జ్ఞాపకాలు మరింత పదిలమవుతున్నాయి అన్న సంతోషమే.


గ్రీకు పదం నుంచి వచ్చింది ఈ ఫోటోగ్రఫీ అనే పేరు. 1836లో మొదటగా ఫొటోగ్రఫీ ప్రారంభం కాగా.. డాగూరే కెమెరా నమూనాను 1839 ఆగస్టు 19న సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌లో ఆరాగే అనే వ్యాపారి విస్తరించాడు. అప్పటి నుంచి ఆగస్టు 19వ తేదీని వరల్డ్‌ ఫొటోగ్రఫీ డేగా పాటిస్తూ వస్తున్నారు.


గతంలోని జ్ఞాపకాల్ని తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగురుతులు ఫొటోలు. అందుకనే దైనందిన జీవితంలో ఫొటోగ్రఫీ ఒక భాగంగా మారింది. అయితే దశాబ్దాలుగా వస్తున్న ఈ ఫోటోగ్రఫీ రాను రాను ఎన్నో దశలు దాటుతూ వస్తోంది. ముందు బ్లాక్ అండ్ వైట్, తరువాత కలర్.. ఇప్పుడు సెల్ఫీ కూడా…అయితే ఫోటో ఎలాంటిదైనా ప్రధానం గా కావాల్సింది సృజనాత్మకత.ఎలా చూస్తే బాగుంటుందో.. ఎలా తీస్తే బాగుంటుందో తెలుసుకుంటే చాలు అందరూ అద్భుతాలు సృష్టించవచ్చు.


ఇప్పుడు ఫోటోగ్రఫీపై అనేక కోర్స్ లూ వచ్చాయి, వర్క్ షాప్ లూ జరుగుతున్నాయి. మీరు కూడా ఒక మంచి కళా ద్రుష్టి ఉన్నవారైతే ఇంకెందుకు ఆలస్యం.. చేతిలో మొబైల్ ఉంది కాబట్టి తీసే ఫోటో మరింత అందంగా ఉండేలా ద్రుష్టి పెట్టండి.. మీరు, మీ ఫోటో అందరి దృష్టిలో పడండి..

Tags

Read MoreRead Less
Next Story