Eye Transplant: ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కంటి మార్పిడి ఆపరేషన్

Eye Transplant: ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కంటి మార్పిడి ఆపరేషన్
వైద్యశాస్త్రంలో అరుదైన ఫీట్‌!

ప్రపంచంలోనే తొలిసారి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా ఓ వ్యక్తి కంటిని సమూలంగా మార్చివేశారు. న్యూయార్క్‌‌లోని లాంగోన్‌హెల్త్‌ హాస్పిటల్ వైద్యులు ఈ ఘనత సాధించారు.

46 ఏళ్ల ఆరోన్ జేమ్స్ లైన్ వర్కర్ గా విధులు నిర్వహిస్తుండగా.. జూన్ 2021లో కరెంట్ షాక్కి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన ముఖం మొత్తం గుర్తుపట్టరానంతగా మారిపోయింది. ముఖ భాగాలు ఛిద్రమైపోయాయి. వెంటనే బాధితుడ్ని న్యూయార్క్‌లోని ఓ హాస్పిటల్ లో చేర్చారు. బాధితుడి ఎడమ కన్ను పూర్తిగా ఛిద్రమయ్యాయని వైద్యులు వెల్లడించారు. ఎడమ కన్ను పూర్తిగా మార్చాల్సిందేనని కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. కంటిని మార్పిడి చేసే ప్రయోగాలు ఎలుకలలో జరిపినప్పుడు కొంత విజయాన్ని సాధించినప్పటికీ - అవి ఎలుకలకి పాక్షిక దృష్టిని అందించాయి. మనుషుల్లో ఈ ప్రయోగం ఎప్పుడూ చేయలేదు. చివరికి ఓ దాత నుంచి కన్ను సేకరించారు. బాధితుడికి ఐ ట్రాన్స్ ప్లాంట్ చేశారు. కంప్లీట్ ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినప్పటికీ సదరు రోగికి పూర్తిగా చూపు వస్తుందో లేదో తెలియదని.. ఆయనకు అమర్చిన కన్ను దాతనుంచి స్వీకరించినవిగా వైద్యులు తెలిపారు. "మేము పూర్తి-కంటి మార్పిడిని పూర్తి చేశాం. 21 గంటలపాటు ఈ సర్జరీ జరిగింది" అని శస్త్ర చికిత్సలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ ఎడ్వర్డో రోడ్రిగ్జ్ అన్నారు.

మార్పిడి చేసిన ఎడమ కన్ను రెటీనాకు ప్రత్యక్ష రక్త ప్రసరణ సహా కాంతిని స్వీకరించడం, మెదడుకు చిత్రాలను పంపడానికి బాధ్యత వహించే విషయంలో ఆరోగ్య పరంగా మంచి సంకేతాలను చూపించింది. అయినప్పటీకి జేమ్స్ తన చూపును తిరిగి పొందుతాడని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ, ఇది చాలా పెద్ద ప్రయోగమే అని 15 ఏళ్లుగా అదే రంగంలో పనిచేస్తున్న కొలరాడో అన్‌స్చుట్జ్ మెడికల్ క్యాంపస్ యూనివర్సిటీ శస్త్రచికిత్స ప్రొఫెసర్ అన్నారు.

ప్రస్తుతం ఇంటికి చేరుకున్న అతడు నెలవారీ చెకప్‌ల కోసం ఆస్పత్రికి వస్తున్నాడని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత గడిచిన సమయాన్ని బట్టి జేమ్స్ కంటి చూపు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story