Top

యూట్యూబర్ చేతిలో ధ్వంసమైన రూ.25 కోట్ల కారు..

అమెరికాకు చెందిన గేజ్ గిలియన్ అనే యూట్యూబర్.. తన తండ్రి కారు పాగాని యేరా రోడ్‌స్టర్ సూపర్ కారులో చక్కర్లు కొడుతున్నాడు.

యూట్యూబర్ చేతిలో ధ్వంసమైన రూ.25 కోట్ల కారు..
X

పదిహేడు ఏళ్ల వయసులోనే ఫేమస్ యూట్యూబర్ అయిపోయాడు.. 25కోట్ల రూపాయల విలువ చేసే నాన్నకారు తీసుకుని వెళుతున్నాడు.. డ్రైవ్ చేస్తూ యూట్యూబ్‌ ఛానల్ కోసం వీడియో షూట్ చేస్తున్నాడు. ఇంతలో కారు కాస్తా బ్యాలెన్స్ తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు అతడికి ఏమీ కాలేదు.. చెయ్యికి మాత్రం ఫ్రాక్చర్ అయితే కట్టించుకున్నాడు. అమెరికాకు చెందిన గేజ్ గిలియన్ అనే యూట్యూబర్.. తన తండ్రి కారు పాగాని యేరా రోడ్‌స్టర్ సూపర్ కారులో చక్కర్లు కొడుతున్నాడు.

ఇంతలో ఏమైందో కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న ఓ చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గేజ్ చెయ్యి విరిగింది. టైరులో ప్రెజర్ తక్కువగా ఉన్న కారణంగానే కారు అదుపుతప్పిందని, ఎదురుగా ఉన్న చెట్టును ఢీ కొట్టిందని గేజ్ చెప్పాడు. కారు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలతో పాటు తనకు ప్రమాదం జరిగిన పరిస్థితిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని తప్పించుకోలేం. కానీ అంతటి ఘోర్ ప్రమాదం నుంచి తప్పించుకుని మళ్లీ జీవించడానికి అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అని గేజ్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

RELATED STORIES