అంతర్జాతీయం

యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ రెస్టారెంట్

యూట్యూబర్ తాను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ రెస్టారెంట్
X

ఏ విషయం గురించి అయినా ఎవరినీ అడగాల్సిన పనిలేదు.. ఇప్పుడన్నీ యూట్యూబ్‌లో దర్శనమిస్తున్నాయి. అలా అని ఏది పడితే అది పోస్ట్ చేసి అభాసు పాలు కాకూడదు. నిజా నిజాలు నిర్ధారించుకోకుండా, ఆ విషయం పట్ల సరైన అవగాహన లేకుండా పోస్ట్ చేస్తే వివాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. తాజాగా ఓ యూట్యూబర్ పోస్ట్ చేసిన వీడియో ఓ రెస్టారెంట్ మూతపడడానికి కారణమైంది. ఆలస్యంగా నిజం తెలుసుకున్న యూట్యూబర్ తాను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

దక్షిణ కొరియాకు చెందిన యూట్యూబర్ హయాన్ ట్రీ తన యూట్యూబ్ ఛానెల్‌లో డేగులోని ఆల్-యు-కెన్-సోయా సాస్-మెరినేటెడ్ రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియోను యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసాడు. వీడియో సారాంశం.. తాను రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మిగిలిన పోయిన పదార్ధాలను వడ్డిస్తున్నారు అని వీడియో చేసి పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ అయింది.

హయాన్ ట్రీ ఛానెల్‌కు అప్పటికే 7లక్షల మంది సబ్‌స్క్రైబ్ ఉన్నారు. రెస్టారెంట్‌కు సంబంధించిన సమీక్ష వీడియో హానికరమైన వ్యాఖ్యలతో ఉంది. అది ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసిన వారిపై ప్రభావం చూపింది. అయితే, రెస్టారెంట్ యొక్క సెక్యూరిటీ కెమెరా ఫుటేజీని మరొకసారి పరిశీలించిన తరువాత, అన్నం మెతుకులు హయాన్ట్రీ ముందు ఆర్డర్ ఇచ్చిన వంటకం నుండి మిగిలిపోయినవి అని తేలింది.

ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకుండా వీడియోను అప్‌లోడ్ చేసాను. అందుకు రెస్టారెంట్ యజమానికి క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను, కాని మరొక వీడియోను చిత్రీకరించడం గురించి యజమాని సుముఖంగా లేడు" అని హయాన్ ట్రీ చెప్పారు. ఖచ్చితమైన వాస్తవాలతో వీడియోను రూపొందించడం చాలా అవసరం అని చెప్పారు.

కానీ అప్పటికే నష్టం జరిగింది. మూసివేసిన రెస్టారెంట్ యజమాని చెయోంగ్ వా డే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. "యూట్యూబర్ వీడియోను పోస్ట్ చేసిన రెండు, మూడు గంటలలోపు సీసీ కెమెరాలోని మొత్తం ఫుటేజీని పరిశీలించాము. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. మా వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోలేదు. తప్పుడు సమీక్ష వీడియో 1 మిలియన్ వీక్షణలకు చేరుకుంది. ఈ వీడియో ఎందుకు వైరల్ అయ్యిందో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు.

సోయా సాస్-మెరినేటెడ్ పీత రెస్టారెంట్ యొక్క వివాదాస్పద సమీక్ష మినహా హయాన్ ట్రీ వీడియోలు ఇప్పటికీ అతని యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్నాయి, అయితే వాటన్నింటికీ వ్యాఖ్య విభాగం బ్లాక్ చేయబడింది. ఈ దెబ్బతో అతడి సబ్ స్క్రైబర్‌ల సంఖ్య 6,70,000 లకు పడిపోయింది. అ ఘటనపై రెస్టారెంట్ యజమానికి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి యూట్యూబర్లను నియంత్రించేలా చట్టాలు తీసుకురావాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు.

Next Story

RELATED STORIES