చేప మరణం.. అధ్యక్షుడి సంతాపం

చేప మరణం.. అధ్యక్షుడి సంతాపం
జాంబియా అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ విశ్వవిద్యాలయంలోని చెరువులో నివసించిన మాఫిషి అనే ఒక చేప మరణానికి సంతాపం ప్రకటించారు.

జాంబియా అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ దేశంలోని రెండవ అతిపెద్ద విశ్వవిద్యాలయంలోని చెరువులో నివసించిన మాఫిషి అనే ఒక చేప మరణానికి సంతాపం తెలిపారు. ఈ చేప మరణంతో కాపర్బెల్ట్ విశ్వవిద్యాలయం (సిబియు) విద్యార్థులు కొవ్వొత్తులను వెలిగించి, క్యాంపస్ చుట్టూ నిలబడి సంతాపం ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా సిబియు విద్యార్థులు ఈ చేపలు పరీక్షలలో తమకు అదృష్టం తెచ్చిపెడుతున్నాయని నమ్ముతున్నారు.

స్థానిక బెంబా భాషలో "బిగ్ ఫిష్" అని అర్ధం ఉన్న మాఫిషి వయసు 22 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. విశ్వవిద్యాలయ చెరువులో ఈ చేప 20 సంవత్సరాల నుంచి ఉంటోందని అక్కడ పనిచేసే సిబ్బంది, అధ్యాపకులతో పాటు విద్యార్థి నాయకుడు లారెన్స్ కసోండే చెప్పారు. అయితే మరణించిన మాఫిషిని ఇంకా ఖననం చేయలేదు. మేము దానిని ఎంబామింగ్ (కెమికల్స్ పూసి చేపని కుళ్లిపోకుండా ఉంచుతారు)చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాము" అని కసోండే తెలిపారు. కొంతమంది విద్యార్థులు పరీక్షలకు హజరయ్యేముందు చేపకు నివాళులర్పించేవారు. అది తమకు అదృష్టం తెచ్చిపెడుతుందని నమ్ముతారు. మరికొందరు కొద్ది సేపు దానిని చూడడం ద్వారాఒత్తిడి తగ్గుతుందని భావించేవారు. రెండవ సంవత్సరం విద్యార్థి ఎడ్విన్ నంబో ఈ చేపను "విశ్వవిద్యాలయానికి చిహ్నంగా" అభివర్ణించాడు. ఈ చేప ఈత కొడుతున్నప్పుడు చూడటం ద్వారా పరీక్ష సమయంలో ఒత్తిడికి గురవకుండా ఉంటామని ఆయన చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story