Zombie Deer Disease: ముంచుకొస్తున్న మరో ముప్పు.. అమెరికాలో జింకలకు కొత్త రోగం

Zombie Deer Disease: ముంచుకొస్తున్న మరో ముప్పు.. అమెరికాలో జింకలకు కొత్త రోగం
వందలాది వన్యప్రాాణులు మృతి, మనుషులకు సోకితే ఆపడం అసాధ్యం

కరోనా మహమ్మారి శాంతించి ఏళ్ళు గడిచినా ఇంకా అనేక విధాలుగా రూపాంతరం చెందుతున్న వైరస్‌ వ్యాప్తి ప్రజలను టెన్షన్ పెడుతూనే ఉంది. ఇప్పుడు మరో వైరస్ మానవాళిని భయపెడుతోంది. అదే ‘జోంబీ డీర్’వైరస్. ప్రస్తుతం జంతువులకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్.. ప్రజలకు సోకడం మొదలైతే మాత్రం మనల్ని మనం రక్షించుకోవడం చాలా కష్టం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే కెనడా శాస్త్రవేత్తలు జోంబీ డీర్ డిసీజ్ అనే ప్రాణాంతక సంక్రమణ వ్యాప్తి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మనుషులు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి అసలు పేరు క్రానిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ప్రతి జంతువును చంపే నాడీ సంబంధిత పరిస్థితి. ఈ వ్యాధి ప్రస్తుతం అమెరికాలో జింకలలో వేగంగా వ్యాపిస్తోంది.

జాంబీ వైరస్ వ్యాప్తి గురించి కెనడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో మనుషులు కూడా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, బ్రిటిష్ కొలంబియా, కెనడాలో జోంబీ వైరస్‌ వ్యాప్తి పెరగకుండా నిరోధించడానికి ఒక వ్యూహాన్ని జారీ చేసింది. ఈ వ్యాధికి సంబంధించిన రెండు కేసులు జనవరి చివరిలో ఇక్కడ నమోదయ్యాయి. అప్పటి నుంచి ఇక్కడి అధికారులు శరవేగంగా కసరత్తు చేస్తున్నారు. రోడ్డుపై చంపిన ప్రతి జింక, దుప్పి, ఎల్క్ లేదా కారిబోలను పరీక్షించాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

జోంబీ వైరస్‌ మెదడు, ఇతర కణజాలాలలో పేరుకుపోయి శారీరక, ప్రవర్తనా మార్పులు, క్షీణత, చివరికి మరణానికి కారణమవుతుంది. ఇది ఒక జంతువు నుండి మరో జంతువుకు సంపర్కం ద్వారా లేదా పరోక్షంగా మలం, నేల, వృక్షసంపద వంటి పర్యావరణంలో వ్యాపిస్తుంది. జంతువులు వాటి మేత లేదా పచ్చిక బయళ్లను మోసుకెళ్లే ప్రియాన్‌లతో కలుషితమైతే కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ఒక జింకలో ఈ లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కాలం పట్టవచ్చు. జింక బరువును తీవ్రంగా కోల్పోవడం, మొత్తం శక్తిని కోల్పోయి చచ్చుబడిపోయినటుంటి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దప్పిక వేయడం, నోటినుంచి చొంగకారడం లాంటి సంకేతాలు ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story