క్రైమ్

యువతిని ఇంటికి తీసుకు వచ్చి.. భార్య ముందే..

యువతిని ఇంటికి తీసుకు వచ్చి.. భార్య ముందే..
X

పెళ్లికి ముందు ప్రేమ. ఎంతో అందంగా కనిపించింది ఆమె. అందుకే తల్లి దండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు బెంగళూరుకు చెందిన సయ్యద్ రెహమాన్. యూఎస్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె.. అక్కడే ఉద్యోగం చేస్తున్న సయ్యద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు ఇద్దరూ అన్యోన్యంగానే కాపురం చేసారు. పైళ్లైన మూడు నెలల కి ఉద్యోగం మానేసి భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతికేవాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో తిరగడం, జల్సాలు చేయడం అలవరచుకున్నాడు. ఓ యువతితో పరిచయాన్ని పెంచుకున్నాడు. విషయం తెలిసి సయ్యద్‌ని మందలించింది భార్య. దీంతో మరింత రెచ్చిపోయిన సయ్యద్ యువతిని తీసుకుని ఏకంగా ఇంటికే వచ్చేవాడు. భార్య ముందే ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. అదేమని ప్రశ్నించిన భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భరించలేని ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. వారి జోక్యంతో కాస్త మారినట్టు నటించాడు.

ఇటీవల భార్యాభర్తలు ఇద్దరు అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. బెంగళూరులో ఉన్న ఆర్టీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇక్కడికి వచ్చినా మళ్లీ మొదటికే వచ్చాడు సయ్యద్. మరో అమ్మాయిని వివాహం చేసుకోవడానికి పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే భార్యకు తలాక్ చెప్పాడు. దీంతో సయ్యద్ భార్య ఆర్టీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు సరైన రీతిలో స్పందించట్లేదని బాధితురాలు వాపోతుంది. తనకు న్యాయం చేయమంటూ వేడుకుంటోంది.

Next Story

RELATED STORIES