అందుకే నిజామాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోయింది - కోదండ‌రాం

అందుకే నిజామాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోయింది - కోదండ‌రాం

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్రజ‌లు విజ‌యం సాధించారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండ‌రాం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజ‌ల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు అద్దం పట్టాయని చెప్పారాయన. ఎర్రజొన్న, ప‌సుపు రైతుల సమస్యలను స‌రిగా ప‌రిష్కరించ‌నందుకే నిజామాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోయిందని తెలిపారు.

ఇప్పటికైనా ప్రజా స‌మ‌స్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల‌ని సూచించారు. తెలంగాణవ్యాప్తంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు కోదండరాం. ప్రజా స‌మ‌స్యలపై రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story