శబరిమలలో 40 కేజీల బంగారం, వంద కేజీల వెండి మాయం?

శబరిమలలో 40 కేజీల బంగారం, వంద కేజీల వెండి మాయం?

శబరిమల వివాదాలు అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే మహిళల ప్రవేశంపై జరుగుతున్న రాద్దాంతం అంతాఇంతా కాదు.. తాజాగా ఆలయానికి చెందిన బంగారం మాయమైందని వస్తున్న ఆరోపణలు మరింత కలవరపెడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కిలోల బంగారం, వంద కేజీల వెండి కనిపించడం లేదని తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగాదుమరం రేపుతోంది. ట్రావెర్ కోర్ దువస్వామ్ బోర్డు దీనిపై దృష్టి సారించింది.

అయ్యప్ప ఆలయానికి భక్తులు పెద్దఎత్తున బంగారం, వెండి కానుకలుగా ఇస్తుంటారు. వచ్చిన విలువైన వస్తువులను 4- A రిజిస్టర్ లో ఎంటర్ చేస్తారు. అక్కడ నుంచి స్ట్రాంగ్ రూంకు అప్పగిస్తారు. రిజిస్టర్ లో ఉన్నా.. వాస్తవానికి స్ట్రాంగ్ రూంలో బంగారు లేదని అంటున్నారు. 40 కేజీల వరకు తక్కువగా ఉందని.. వంద కేజీల వెండి కూడా లేదని అంటున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరికొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆడిట్ టీంను నియమించింది. ప్రత్యేక బృందం ఆడిట్ చేయనుంది. ఇందులో తక్కువగా ఉంటే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆలయ అధికారుల మధ్య విబేధాలు మొదలయ్యాయి. ట్రావెన్ కోర్ ట్రస్ట్ చైర్మన్ పద్మ కుమార్ మాత్రం బంగారు మాయం కాలేదని.. గ్రాము కూడా పోలేదని అంటున్నారు. మాయమైనట్టు ఆధారాలు దొరికితే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇటీవల ఆలయంలో జరిగిన ఓ వివాదం కూడా కలకలం రేపుతోంది. స్ట్రాంగ్ రూమ్ ఇంఛార్జిగా ఉన్న ఉద్యోగి ఇటీవల పదవీవిరమణ చేశారు. ఆయనకు రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వడానికి ఆలయ కమిటీ నిరాకరించింది. దీనికి ఏవో కారణాలు కూడా చూపించింది. దీంతో ఆగ్రహం చెందిన ఉద్యోగి తన స్ట్రాంగ్ రూం పరిధిలో ఉన్న బంగారం అప్పగించలేదు. అయితే స్ట్రాంగ్ రూం వివరాలు కొత్త ఉద్యోగికి అప్పగించలేదని.. అందుకే రిటైర్మెంట్ బెన్ పిట్స్ ఆపినట్టు తెలుస్తోంది. బంగారం తేడా ఉంటే అతనిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story