మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐఈడీ పేలుడు..
By - TV5 Telugu |28 May 2019 7:08 AM GMT
జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఝార్ఖండ్ పోలీసులు, 209 కోబ్రా బెటాలియన్‌కు చెందిన సిబ్బంది సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు వీరిపై బాంబు దాడి చేశారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్ సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com