ఎన్నికల తరువాత తొలిసారి బహిరంగంగా మాట్లాడిన చంద్రబాబు..
కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేస్తుందో చూడాలి అన్నారు.. తెలుగు దేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 100కు 40 శాతం ఓట్లు పడ్డాయి అని.. వారందరి కోసం మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలి అని పిలుపు ఇచ్చారు.
గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానేతకు నివాళులర్పించారు చంద్రబాబు. భారీగా తరలివచ్చిన నేతలకు, కార్యకర్తలకు పూర్తి భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఎన్నికల తరువాత తొలిసారి బహిరంగంగా మాట్లాడిన చంద్రబాబు.. ఓటమి గురించి ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడ తప్పులు జరిగాయో సమీక్షించుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్దాం అన్నారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com