చివరి శ్వాస వరకు మీకు అండగా ఉంటా:బాలకృష్ణ

చివరి శ్వాస వరకు మీకు అండగా ఉంటా:బాలకృష్ణ

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. తనను ఆదరించి మరోసారి గెలిపించిన హిందూపురం ప్రజలకు….. తన చివరి శ్వాస వరకు అండగా ఉంటానన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు బాలకృష్ణ. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత సతీమణి వసుంధరతో కలిసి తొలిసారిగా హిందూపురంలో పర్యటించారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించి పట్టణంలోని ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. బాలకృష్ణ రాకతో స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Read MoreRead Less
Next Story