ఆంధ్రప్రదేశ్

కొడుకు కళ్ళ ముందే..

కొడుకు కళ్ళ ముందే..
X

పెళ్లై 23 ఏళ్లయింది. 22 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయినా పుట్టింటి నుంచి ఇంకా ఏదో తీసుకురా అంటూ భర్త రోజూ గొడవ. విజయనగరం సోలికిరి గ్రామానికి చెందిన కొత్తకోట భానుమతికి వెంకటరమణ భార్యా భర్తలు. వీరికి కుమారుడు సాయి ఉన్నాడు. పుట్టింటినుంచి వరకట్నం పేరుతో భూములు రాయించుకు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భార్యని తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ నేపథ్యంలో భార్యను ఇంట్లోనుంచి ఈడ్చుకు వచ్చి తీవ్రంగా దాడి చేశాడు. కొడుకు కళ్ల ముందే భార్యను చిత్రహింసలు పెట్టాడు.. అడ్డుకున్న కొడుకుని కూడా చితకబాదాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES