పక్కింటి అమ్మాయి పెళ్లికి వెళ్లి...

పక్కింటి  అమ్మాయి పెళ్లికి వెళ్లి...

పక్కింటి వాళ్లు పెళ్లికి పిలిస్తే వెళ్లారు. అక్కడ మందు.. చిందు పూర్తయ్యాక ఇంటికి చేరుకున్నారు. ఇంటి రాగానే భర్త కాలర్ పట్టుకుంది భార్య.. పరాయి స్త్రీతో ఆ డ్యాన్సులు ఏంటి అని. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన భర్త విచక్షణా రహితంగా భార్యని గొడ్డలి తీసుకుని నరికి చంపేశాడు. రాజస్థాన్ ఉదయ్ ‌పూర్‌కి చెందిన కషురాం, భికాలి భార్యా భర్తలు. పక్కింటి వాళ్ల అమ్మాయి పెళ్లికి రమ్మంటూ వీరికి ఆహ్వానం అందింది. ఇద్దరూ కలిసి పెళ్లికి వెళ్లారు. అక్కడ పెళ్లి తంతు పూర్తయ్యాక కుటుంబం సభ్యులు, స్నేహితులు అంతా కలిసి సందడి చేశారు. ఒకిరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ, డ్యాన్సులు చేస్తూ మజా చేశారు. భార్య ఈ వేడుకల్లో పాల్గొనకపోయినా చూసి ఆనందిస్తోంది. భర్త కషురాం మాత్రం అమ్మాయితో కలిసి స్టెప్పేశాడు. చూసినంత సేపు బాగానే ఉంది భికాలి. అక్కడి నుంచి భోజనాలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లారు ఇద్దరూ. ఇక అప్పుడు మొదలెట్టింది. 60 ఏళ్ల వయసులో ఆ డ్యాన్సులు ఏంటి. అవసరమా నీకు అని భర్తని నిలదీసింది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని కషూరాంకి కోపం కట్టలు తెంచుకుంది. అంతే మూలనున్న గొడ్డలి తీసుకుని భార్య భికాలిని నరికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కషూరాంని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story