బిగ్‌బాస్ 3లో బ్యాడ్మింటన్ బ్యూటీ

బిగ్‌బాస్ 3లో బ్యాడ్మింటన్ బ్యూటీ

ఓసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే చాలు. బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ. బయటకి వచ్చాక అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. హౌస్‌లో కంటెస్టెంట్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. బయట ప్రపంచానికి దూరంగా బావిలో కప్పలా అందులోనే ఉంటూ అన్నీ భరిస్తూ గెలుపే ధ్యేయంగా ఆటాడేస్తుంటారు. ఇక ఇందులో కంటెస్టెంట‌్‌లుగా ఎవర్ని తీసుకోవాలనేది పెద్ద ప్రహసనం. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లు కాకపోతే షో చప్పగా సాగుతుంది. టీ ఆర్ పీ రేటింగులు రావాలి, అందరూ షో గురించే మాట్లాడుకోవాలంటే మామూలు వాళ్లైతే సరిపోరు. మహా మహులు కావాలి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కంటే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరవ్వకపోయినా కావలసినంత పబ్లిసిటీ ఇప్పటికే సంపాదించుకున్న గుత్తా జ్వాలకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా వచ్చిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో కనిపించిన జ్వాల సినిమాల్లోకి వస్తుందేమో అనుకున్నారు అప్పట్లో అంతా. అయితే అలాంటిదేమీ లేదంటూ కొట్టి పారేసింది. ఇప్పుడు అలాగే బిగ్ బాస్ షోలో జ్వాల అన్న వార్తల్ని కూడా ఆమె కొట్టి పారేస్తోంది. నిప్పులేందే పొగరాదని.. మరి నీ పేరు ఎందుకు వినిపించింది.. డీల్ ఏమైనా క్యాన్సిల్ అయిందా.. రెమ్యునరేషన్ అడిగినంత ఇవ్వనన్నారా అంటే.. అలాంటిదేమీ లేదంటోంది. అవన్నీ రూమర్స్. బిగ్ బాస్ చేయట్లేదు అని ట్విట్టర్‌లో తెలిపింది. సో.. బిగ్ బాస్ హౌస్‌లో జ్వాల ఉండట్లేదనేది కన్ఫామ్. మరి కంటెస్టెంట్లు ఎవరనేది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుందని అంటున్నారు. ఇక హోస్ట్‌గా నాగార్జున పేరు తెరపైకి వచ్చింది. అయితే షో ప్రారంభం కావడానికి మరి కొద్ది రోజులు సమయం పడుతుందంటున్నారు. త్వరలో వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఈ టోర్నమెంట్ ముగిసిన తరువాత షో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. టాప్ సెలబ్రిటీల కోసం బిగ్ బాస్ వేట సాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story