కూతురు పెళ్లిలో పాట పాడుతూ ఒక్కసారిగా..

కూతురు పెళ్లిలో పాట పాడుతూ ఒక్కసారిగా..

కూతురి పెళ్లికి బంధువులంతా వచ్చారు. అట్టహాసంగా పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన అతిధులంతా ఆసీనులై ఉన్నారు. అతిధులను ఎంటర్‌టైన్ చేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే వచ్చిన అతిధులు కూడా పాటల్లో పాలుపంచుకుంటున్నారు. పెళ్లి కూతురి తండ్రి కూడా సరదాగా ఓ పాట పాడాలని మైక్ అందుకున్నాడు.

పాట పాడుతూనే సడెన్‌గా వెనక్కి ఒరిగిపోయాడు. ఒక్కక్షణం ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. వచ్చి చూసేసరికి ప్రాణం పోయింది. ఆసుపత్రికి తీసుకువెళ్లగా సడెన్ హార్ట్ స్ట్రోక్ అని డాక్టర్లు వివరించారు. కేరళ తిరువనంతపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడు కర్మనా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న విష్ణు ప్రసాద్‌ అని తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story