ఆమె మాకొద్దు..వెంటనే తొలిగించండి

ఆమె మాకొద్దు..వెంటనే తొలిగించండి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వీసీ రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్ అనురాధల హయాంలో అవినీతి విపరీతంగా పెరిగిపోతోందంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎస్వీయూ పరిపాలన భవనం ముందు నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా విసి రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారని విద్యార్థులు అంటున్నారు. రిజిస్ట్రార్ అనురాధకు తలొగ్గి యూనివర్సిటీ పాలన కొనసాగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story