ఎన్టీఆర్ 96వ జయంతి.. తారక్, కళ్యాణ్ రామ్ నివాళి

ఎన్టీఆర్ 96వ జయంతి.. తారక్, కళ్యాణ్ రామ్ నివాళి

తెలుగు వారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనమై నినదించిన నందమూరి తారకరామారావు జయంతి నేడు ( may 28). ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ నివాళులు అర్పించారు. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతికి చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. పెద్దాయన ఆశీస్సులు ఎప్పటికీ తెలుగు ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story