డాక్టర్‌ కావాలని ఎన్నో ఆశలతో ఉక్రెయిన్‌ వెళ్ళి..చివరకు..

డాక్టర్‌ కావాలని ఎన్నో ఆశలతో ఉక్రెయిన్‌ వెళ్ళి..చివరకు..
X

డాక్టర్‌ కావాలని ఎన్నో ఆశలతో ఉక్రెయిన్‌ వెళ్లిన సుమారు 2 వేల మంది భారత విద్యార్థులు అక్కడ ఆందోళన బాట పట్టారు. చివరి సంవత్సరం పరీక్ష క్రాక్‌-2 సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు సమాధానాలు రాయలేకపోయారు. విద్యాసంవత్సరం వృథా అయ్యే అవకాశం ఉండడంతో

వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

6 సంవత్సరాల డాక్టర్ డిగ్రీ కోసం వేలాది మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్‌ వెళ్లారు. చివరి సంవత్సరం క్రాక్‌-2 పరీక్షలో ఆంకాలజీ, ఆబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ వంటి సబ్జెక్ట్‌ల్లో ప్రశ్నలు ఉంటాయని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ నెల 24న నిర్వహించిన పరీక్షల్లో వెబ్‌సైట్‌లో పేర్కొన్న సబ్జెక్టల్లో నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. క్రాక్‌-2 పరీక్ష పాసయితేనే, కోర్సు పూర్తయినట్టు. విద్యార్థులు స్వదేశానికి తిరిగి రావడానికి అవకాశం కలుగుతుంది. అయితే కావాలనే సిలబస్ లేని ప్రశ్నలు ఇచ్చి, విద్యా సంవత్సరం వృథా అయ్యేలా చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా ఉక్రెయిన్ ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు. తమ బాధలను సుష్మా స్వరాజ్ కూడా ట్వీట్‌ చేశామని విద్యార్థులు చెప్పారు. తమ లాగే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో క్రాక్‌-2 బాధితులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేసేలా ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భారతీయ మీడియాకు విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story