గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న వామపక్ష పార్టీలు : రామకృష్ణ

గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న వామపక్ష పార్టీలు : రామకృష్ణ

దేశంలో వామపక్ష పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నాయని అన్నారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. జాతీయ స్థాయిలో ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ తో దేశంలో పరిస్థితులు మారాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో జనసేన, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ కలిసి ప్రజల్లోకి వెళ్లలేకపోవటం వల్లే ఓటమి చెందామని విశ్లేషించారాయన. వచ్చే నెల మొదటివారంలో విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story