ఇటుక బట్టీలో పనిచేస్తున్న బాలికను అతి దారుణంగా..

ఇటుక బట్టీలో పనిచేస్తున్న బాలికను అతి దారుణంగా..

యూపీలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ళ బాలికపై దుండగులు లైంగిక దాడికి పాల్పడి అనంతరం సజీవ దహనం చేశారు. ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ ఇటుక బట్టీలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఓ బీద కుటుంబానికి చెందిన బాలికపై అంగతకులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం తల్లితండ్రులు ఆస్పత్రిలో ఉండగా ఇంట్లో తమ్ముడితో ఉన్న అమ్మాయిని చూసిన దుండగులు అపహరించి అత్యాచారం చేశారు.

ఈ ఘటనలో ఏడుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్న నేపథ్యంలో వారి కోసం గాలిస్తున్నారు. బాలికపై కన్నేసిన ఇటుక బట్టీ యజమాని మరో ఆరుగురుతో కలిసి ఆమెపై ఈ సామూహిక అత్యాచానికి పాల్పడి సజీవ దహనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

Tags

Read MoreRead Less
Next Story