ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం

ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం

ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఒడిశాకు సీఎం కావడం ఇది వరుసగా ఐదోసారి. ఆయనతో పాటు 21 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్‌లో 10 మంది కొత్తవారికి నవీన్ పట్నాయక్‌ చోటిచ్చారు.

పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అక్కడి 147 సీట్లలో నవీన్‌ పట్నాయక్‌ పార్టీ బిజూ జనతాదళ్ 112 చోట్ల గెలిచింది. మరోసారి గ్రాండ్ విక్టరీ సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. సీఎంగా నవీన్‌ పట్నాయక్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది.

Tags

Read MoreRead Less
Next Story