తెలంగాణలో మండల, జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్‌..

తెలంగాణలో మండల, జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్‌..

తెలంగాణలో మండల, జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వచ్చే నెల 7, 8 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. MPTC, ZPTC ఓట్ల లెక్కింపు జూన్‌ 4న ఉంటుంది. రెండు రోజుల విరామం తర్వాత మండల, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లతో పాటు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకొనేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. MPP, వైస్‌ ఛైర్మన్లు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జూన్‌ 7న జరగనుంది. అలాగే, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, కోఆప్షన్‌ సభ్యులను జూన్‌ 8న ఎన్నుకోనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్‌ల పదవీ కాలం జులైలో ప్రారంభం కానుంది. కానీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎక్కువ సమయం ఉంటే సభ్యుల ఫిరాయింపులకు, అక్రమాలకు ఆస్కారం ఉంటుందని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో రాష్ట్ర పంచాయతీ రాజ్‌ చట్టాన్ని సవరించి ప్రమాణస్వీకారంతో సంబంధం లేకుండా పరోక్ష ఎన్నిక నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

Tags

Next Story