దారుణం.. మహిళను పోలీసు అధికారి..

హర్యానాలో అమానవీయ ఘటన జరిగింది. ఫరీదాబాద్‌లో ఓ మహిళతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. విచక్షణమరిచి ఆమెను బెల్ట్‌తో కొట్టారు. గత నవంబర్‌లో జరి గిన ఈ సంఘటన, రెండు రోజుల క్రితం వెలుగుచూసింది.
ఓ కేసు విషయంలో ఆ మహిళను పోలీసు అధికారి బెల్ట్‌తో కొట్టారు. అక్కడే మరో నలుగురు పోలీసులు ఉన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఫరీదాబాద్ పోలీసు కమిషనర్ స్పందిం చారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్‌తో పాటు ముగ్గురు స్పెషల్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మహిళను బెల్ట్‌తో కొట్టిన ఉదంతంపై హర్యానా మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఐదుగురు పోలీ సులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని సూచించింది. మహిళలకు సంబంధించిన కేసులను మహిళా పోలీసు స్టేషన్లలోనే విచారించాలని హితవు పలికింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com