ప్రయాణికురాలి నుంచి రూ. కోటి 50 లక్షలు..

ప్రయాణికురాలి నుంచి రూ. కోటి 50 లక్షలు..

శంషాబాద్‌ విమానాశ్రయం కేంద్రంగా బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి నుంచి 11 కిలోల బంగారం 4లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. నిందితురాలిపై కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో బంగారంతో పాటు విదేశీ కరెన్సీ సైతం పట్టుబడిన నేపథ్యంలో.. ఈస్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూఫీ లాగుతున్నారు డీఆర్‌ఐ అధికారులు.

విచారణలో ఆమె నగరంలోని ఓ హోటల్‌లో ఉంటున్నట్లు తెలియడంతో గదిలో తనిఖీ చేసి అక్కడ అమెరికా, సౌదీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి 50 లక్షలుగా అధికారులు లెక్కగట్టారు. దీంతోపాటు ఆమె గదిలో బంగారం అమ్మకానికి సంబంధించిన కొన్ని రశీదులను స్వాధీనం చేసుకున్నారు. కొన్నినెలలుగా తాను ఇలా విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చి అమ్ముతున్నట్లు విచారణలో ఆమె అంగీకరించింది. డీఆర్‌ఐ అధికారులు అమెను అరెస్టు చేసి రిమాండుకు తరిలించారు.

Tags

Read MoreRead Less
Next Story