జగన్‌ను ఓ మహిళా అడ్డుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.. చివరకు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్‌ను ఓ మహిళా అడ్డుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న జగన్… ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి వెళ్లి… అక్కడి నుండి కడపకు వెళ్లాల్సి ఉండటంతో… తన కాన్వాయ్‌లో బయలుదేరారు. సడెన్‌గా ఓ మహిళ ఆ కాన్వాయ్‌కి అడ్డుగా వెళ్లింది. అంతే ఒక్కసారిగా అంతా షాక్‌కు గురయ్యారు. ఈ లోపే సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆమెను వెనక్కు పంపేందుకు ప్రయత్నించడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఇదంతా గమనించిన జగన్.. ఆమెను దగ్గరికి పిలిచి మాట్లాడాడు.
ఆ మహిళ తనది అమలాపురం అని జగన్‌కు తెలిపింది. తన భర్తకు ఉద్యోగం కావాలని కన్నీరు పెట్టుకుంది. తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న జగన్, ఆందోళన చెందవద్దని ఆమెకు భరోసా ఇచ్చి వెళ్లిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com