ఆంధ్రప్రదేశ్

సాయంత్రం విజయవాడకు వైయస్ జగన్

వైసీపీ అధినేత జగన్ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి ఫాస్టర్లు జ‌గ‌న్‌ను ఆశ్వీర‌దించారు. కడప నుంచి పులివెందుల చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్‌తో పాటు ఎంపీ అవినాష్‌ రెడ్డి కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు జగన్. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకుంటారు. అంతకు ముందు తిరుపతి నుంచి కడప చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద దర్గాను సందర్శించారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, దర్గా పీఠాధిపతి స్వాగతం పలికారు.

Next Story

RELATED STORIES