అసలు ఈమెకు ఎమోషన్స్ లేవా? అంటూ..

అసలు ఈమెకు ఎమోషన్స్ లేవా? అంటూ..

సోషల్ మీడియాలో సెలబ్రెటీస్ పిల్లలపై ట్రోలింగ్ పెరిగిపోయాయి. తాజాగా అజయ్ దేవగన్, కాజోల్ ల గారాలపట్టి నైసా దేవగన్ ట్రోలింగ్ బారిన పడింది. గత కొన్నిరోజులుగా నైసాపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు చే్స్తున్నారు. ఎంతలంటే కూతురిపై వస్తున్న ట్రోలింగ్స్‌ను తట్టుకోలేక అజయ్ దేవగన్ ఏకంగా ప్రెస్ మీట్‌ను పెట్టారు. తనకు ఇంకా 14 ఏళ్ళ అంటూ..ఇక విమర్శలను అపలంటూ నెటిజన్స్‌ను కోరారు. తాజాగా మరోసారి నైసాను నెటిజన్స్ టార్గెట్ చేశారు.

అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ చనిపోయి ఒక్కరోజు కూడా కాకముందే నైసా ఎటువంటి బాధ కూడా లేకుండా సెలూన్ సెషన్ కి వెళ్లిందని ట్రోల్స్ చేస్తున్నారు. "తాత చనిపోయిన ఈ పిల్లకు బాధ లేదా?" అంటూ నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. అలాగే నైసా సంబంధించిన ఓ ఫోటోను కూడా షేర్‌ చేసి కామెంట్స్ చేస్తున్నారు.ఇంతలా ఆ అమ్మాయిపై నెటిజెన్స్ కామంట్ప్ చేయడానికి కారణమేమిటంటే…అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ ముంబైలో మే 27న మరణించాడు. మరుసటి రోజే నైసా సెలూన్ లో ప్రత్యక్షమవడం ప్యాషన్ దుస్తులతో ఫోటోలకు ఫోజులివ్వడం ఆ ఫోటోలు నెట్ లో ప్రత్యక్షమవడంతో వాటిని చూసిన నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.ట్రోలింగ్స్ నైసాకు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎన్నో సార్లు ట్రోలింగ్ కు గురైంది. ఇటీవలే ఎయిర్ పోర్ట్ లో నైసా డ్రెస్ పై విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అప్పుడు ఈ విషయంపై స్పందించిన అజయ్ దెవగన్ కనీసం పిల్లలనైనా వదిలేయండని ఫోటోగ్రాఫర్స్ ని వేడుకుంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story