ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఈడీ సమన్లు

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఈడీ సమన్లు

కాం‍గ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. అక్రమాస్తులకు సంబంధించి మనీల్యాండరింగ్‌ కేసులో విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలోని NCR, రాజస్థాన్‌లోని బికనీర్‌లో రాబర్ట్ వాద్రాకు బినామీ ఆస్తులున్నాయనే ఆరోపణలున్నాయి. లండన్‌లో 16 కోట్ల విలువైన ఆస్తుల్ని రాబర్ట్ వాద్రా కొన్నట్లు, ఈ విషయంలో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్లు ఆయనపై కేసు రిజిస్టరైంది.

మనీలాండరింగ్‌ పాల్పడినటువంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ ఉండటం కరెక్టు కాదని ఈడీ సోమవారం ఢిల్లీ హైకోర్టులో వాదించింది. దాన్ని రద్దు చెయ్యాలని కోరింది. ఈడీ వాదనకు వివరణ ఇవ్వాలని వాద్రాను హైకోర్టు కోరింది. ఇందుకు జులై 17 వరకూ టైమ్ ఇచ్చింది. ఈనేపథ్యంలో రాబర్ట్ వాద్రాకు ఎలాగైనా బెయిల్ రద్దు చెయ్యించాలని చూస్తున్న ఈడీ.. మరిన్ని ఆధారాల వేటలో ఉంది. అందులో భాగంగానే రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేసింది.

మరో వైపు దీని వెనక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తన రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలాంటి దారుణాలను పాల్పడుతుందని విమర్శించింది. ఇటీవల బీజేపీ గెలిచిన తర్వాత… ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఎన్డీయేలకు అభినందనలు. భారతదేశంలో లౌకిక, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగుతుందని ఆశిస్తున్నానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు రాబర్ట్ వాద్రా. కాంగ్రెస్ కార్యకర్తలు తమ పోరాటం కొనసాగించాలని కోరారు. ఈ పరిస్థితుల మధ్య ఈడీ ఆయన్ని అరెస్టు చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

Next Story